Mega Family Sankranthi Celebrations | మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మనశంకరవరప్రసాద్ గారు సినిమాతో హిట్టు అందుకున్న సంతోషంలో ఉన్న ఈ ఫ్యామిలీకి సంక్రాంతి పండుగ మరింత సందడిని తీసుకువచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ సభ్యులందరూ ఒకే చోట చేరి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా భోగి రోజున మెగా హీరోలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, మరియు వైష్ణవ్ తేజ్ వంటింట్లోకి దూరి స్వయంగా దోశెలు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చరణ్ ఎంతో నేర్పుగా దోశెలు వేయగా.. మెగా కుటుంబ సభ్యులు ఈ వీడియోలో సందడి చేశారు. ఇక ఈ సందడి మొత్తాన్ని నిహారిక కొణిదెల తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. ఇది భోగి రోజులా లేదు, ‘దోశ డే’ లా ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు నాగబాబు దంపతులు, సాయి దుర్గా తేజ్, కొత్త జంట వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. సాయి దుర్గా తేజ్ ఒక పక్కన కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తుండగా, మిగిలిన వారంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.