Sanjay Dutt | పూరి జగన్నాథ్-రామ్ కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కు కొనసాగింపుగా అదే కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ తాజా అప్డేట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘డబుల్ ఇస్మార్ట్’లో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ విలన్‌గా కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
‘కేజీఎఫ్-2’లో విలన్‌గా నటించి మెప్పించిన సంజయ్‌దత్ ‘డబుల్ ఇస్మార్ట్’లో మరింత వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడని, ఇటీవల ఈ విషయంపై సంజయ్‌దత్‌ను చిత్రబృందం సంప్రదించిందని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు వెలువడలేదు. త్వరలోనే చిత్రబృందం సంజయ్‌దత్ పాత్ర గురించి క్లారిటీ ఇస్తారని సమాచారం.