Sanjay Dutt | ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ హోస్ట్ చేసే ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఎప్పటికీ నవ్వుల పంట పండించే కార్యక్రమంగా పేరుపొందింది. అయితే, తాజాగా విడుదలైన ఓ ప్రోమో మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఎపిసోడ్‌కు బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, సునీల్ శెట్టి స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు.షోలో కపిల్ శర్మ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతూ ఉండగా, ఒక అభిమాని మైక్ తీసుకుని సంజయ్ దత్‌ను ఆశ్చర్యపరిచాడు. “సంజయ్ సర్, నేను ఈ రోజు నా భార్య, నా గర్ల్‌ఫ్రెండ్ ఇద్దరినీ తీసుకుని షోకు వచ్చాను,ష అని చెప్పడంతో సెట్లో ఒక్కసారిగా నోరెళ్లపెట్టారు
కపిల్, అర్చనా పూరన్ సింగ్, సంజయ్ దత్, సునీల్ శెట్టి కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒకేసారి భార్యను, ప్రేయసిని తీసుకుని రావడమా?” అంటూ ఆశ్చర్యపోయారు. కానీ… మూడుసెకన్ల నిశ్శబ్దం తర్వాత నవ్వుల పూవులు విరబూశాయి. సంజయ్ దత్ నేరుగా అతని వద్దకు వెళ్లి , ఇలా మీరు ఎలా చేయగలిగారు? దయచేసి ఆ టెక్నిక్ మాకు కూడా చెప్పండి! అని అనడంతో షో మొత్తం కేకలతో మార్మోగిపోయింది. ఈ సరదా సంభాషణ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అభిమాని రాక్ చేశాడు, స్టార్స్ షాక్ అయ్యారు అని ఒకరు, ఈ ఎపిసోడ్ టీఆర్పీ రికార్డులను బద్దలుకొట్టేలా ఉంది అని మరొకరు కామెంట్ చేశారు.
అయితే సంజయ్ దత్ వ్యక్తిగత జీవితం కూడా దాదాపు ఇలానే సాగింది. మాధురీ దీక్షిత్, టీనా మునిమ్లతో ప్రేమాయణాలు, మూడు పెళ్లిళ్లు అన్నీ బాలీవుడ్లో హాట్ టాపిక్స్‌గా మారాయి.1987లో రిచా శర్మను వివాహం చేసుకుని, త్రిషాల అనే కుమార్తెకు తండ్రి అయ్యారు. రిచా 1996లో కన్నుమూశారు. తర్వాత 1998లో రియా పిళ్లైని పెళ్లాడి, 2008లో విడాకులు తీసుకున్నారు.అదే ఏడాది మాన్యతా దత్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి షహ్రాన్, ఇక్రా అనే కవలలు ఉన్నారు. ఇలాంటి వ్యక్తిగత చరిత్ర ఉన్న సంజయ్ దత్… “ఒకేసారి ఇద్దరినీ ఎలా మేనేజ్ చేస్తారు?” అనే ప్రశ్నకు సమాధానం అడగడమే ఈ క్లిప్‌కి మ్యాజిక్ తీసుకువచ్చింది. షో ప్రోమో చూసినవారెవ్వరికైనా నవ్వు ఆగదు అనడంలో సందేహమే లేదు.