Double Ismart | రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇటీవలే విడుదల చేసిన ‘స్టెప్పా మార్’ పాటకు మంచి స్పందన లభించిందని, ఓల్డ్‌సిటీ శంకర్‌గా రామ్ పాత్ర మాస్ అంశాలతో ఆకట్టుకుంటుందని, ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చిత్ర బృందం పేర్కొంది.
కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయి కె నాయుడు, జియాని జియాన్నెలి, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మికౌర్, రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్.