మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Aug 23, 2020 , 09:24:22

గ‌ణ‌ప‌తి పూజ‌లో పాల్గొన్న సంజ‌య్ ద‌త్

గ‌ణ‌ప‌తి పూజ‌లో పాల్గొన్న సంజ‌య్ ద‌త్

బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ ప్ర‌స్తుతం క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.  ఆగ‌స్ట్ 8న సంజ‌య్‌కి శ్వాస స‌మ‌స్య త‌లెత్తడంతో క‌రోనా పరీక్ష‌ల కోసం అని లీలావ‌తి ఆసుప‌త్రికి వెళ్ళారు.  అక్క‌డ‌ ఆయ‌న లంగ్‌ క్యాన్స‌ర్ బారిన పడ్డ‌ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.  ప్ర‌స్తుతం సంజ‌య్  స్టేజ్‌-3 ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవ‌ల‌ ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్న సంజ‌య్ ద‌త్ త‌ర‌చు ఆసుప‌త్రికి వెళ్ళి వ‌స్తున్నారు. 

క్యాన్స‌ర్ కార‌ణంగా కొద్ది రోజుల పాటు త‌న ప్రాజెక్టుల‌కి బ్రేక్ ఇచ్చాడు. ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టారు. శ‌నివారం గ‌ణేష్ చ‌తుర్ధి కావ‌డంతో సంజ‌య్ ద‌త్ త‌న ఇంట్లో భార్య మాన్య‌త‌తో క‌లిసి పండుగ జ‌రుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ... ప్ర‌తి సంవ‌త్స‌రం మాదిరిగా ఈ ఏడాది పండుగ‌ని ఘ‌నంగా చేయ‌క‌పోయిన‌, బ‌ప్పాపై విశ్వాసం అలానే ఉంది. ఈ పవిత్రమైన పండుగ మన జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. మనందరికీ ఆరోగ్యం, ఆనందం అందించాల‌ని  నేను కోరుకుంటున్నాను. గణపతి బప్పా మోరియా అంటూ సంజ‌య్ పేర్కొన్నారు లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.