మ్యాడ్, మ్యాడ్ స్కేర్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న సంగీత్ శోభన్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంబ్లర్స్’. ప్రశాంతి చారులింగా కథానాయిక. కేఎస్కే చైతన్య దర్శకుడు. సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతలు. ప్రసుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ ఇదొక మిస్టరీ ఎంటర్టైనర్.
సంగీత్ శోభన్ ఇందులో కొత్తగా కనిపిస్తారు. నటుడిగా ఆయనలోని మరోకోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. ఇందులోని థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్టులు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయి.’ దర్శకుడు చెప్పారు. కొత్త కాన్సెప్ట్‌తో, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ సినిమా తప్పకంపడా అందర్నీ అలరిస్తుందని నిర్మాతలు చెప్పారు. రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్న, సాయిశ్వేత, జస్విక, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్ సాగర్, సంగీతం: శశాంక్ తిరుపతి.