Sandhya Theatre Stampede | పుష్ప-2 రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటలు సాగిన ఈ విచారణ ముగిసినట్లు తెలుస్తుంది. అలాగే విచారణ అనంతరం సంధ్య థియేటర్ ఘటనపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది.
ఇదిలావుంటే ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడైన ఆంటోనీ బౌన్సర్లకి ఆర్గనైజర్‌గా పనిచేస్తాడని సమాచారం.