Prabhas Spirit | ప్రభాస్ అభిమానులతో పాటు టాలీవుడ్ మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న చిత్రాలలో స్పిరిట్ కూడా ఒకటి. ప్రభాస్ కథానాయకుడిగా రాబోతున్న ఈ చిత్రంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్నాడు. తృప్తి దిమ్రీ కథానాయికగా నటించబోతుంది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. ఇప్పటివరకు ఈ మూవీపై ఎటువంటి అప్డేట్ రాలేదన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లేది ఎప్పుడో కనఫర్మ్ చేశాడు దర్శకుడు సందీప్. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాబోతున్న కింగ్డమ్ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గోన్న సందీప్ దీని గురించి మాట్లాడాడు.
స్పిరిట్ సెప్టెంబర్ చివరివారంలో స్టార్ట్ కాబోతుందని అప్పటినుంచి రెగ్యులర్ షెడ్యూల్ షూటింగ్ ఉంటుందని సందీప్ వంగా చెప్పుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Director #SandeepReddyVanga confirms that #Spirit will go on floors from the end of September with back to back schedules and non stop shooting!🔥 #Prabhas𓃵 pic.twitter.com/nEm6Fxt4Qs
— Chandu ʳᵉᵇᵉˡʷᵒᵒᵈ (@Chandu47603912) July 25, 2025