Sandeep Reddy Vanga | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD), మారుతి డైరెక్షన్లో నటిస్తున్న రాజాసాబ్ చిత్రాలున్నాయి. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా మరోవైపు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ (Spirit) సినిమాను కూడా ప్రకటించాడు.
పొట్టేల్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. స్పిరిట్ ప్రొడక్షన్ పనుల్లో ఎలాంటి ఆలస్యం ఉండబోదని.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ మొదలవుతుందన్నాడు. రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివరలో మొదలు కానుందని చెప్పాడు. తన సినిమాలపై వచ్చే విమర్శలను పట్టించుకోకుండా మరో బ్లాక్ బస్టర్ అందించేందుకు కేవలం స్క్రిప్ట్‌పై మాత్రమే దృష్టిపెట్టాలని సందీప్ రెడ్డికి సూచిస్తున్నారు మూవీ లవర్స్, అభిమానులు.
స్పిరిట్‌లో ప్రభాస్ కెరీర్లో తొలిసారి ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇప్పటికే వెల్లడించాడని తెలిసిందే . సందీప్ రెడ్డి వంగా ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాల్లో హీరోయిజాన్ని చూపించినట్టుగానే స్పిరిట్‌లో ప్రభాస్ పాత్ర ఉండబోతుందన్నాడు. సందీప్‌రెడ్డి వంగాతో కలిసి టి సిరీస్ అధినేత భూషణ్‌కుమార్ స్పిరిట్ సినిమాను నిర్మించనున్నారు.
యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కు ముందే స్పిరిట్ సెట్స్‌పైకి వెళ్తుందని ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది.
సందీప్ రెడ్డి వంగా మరోవైపు అల్లు అర్జున్‌తో AA23 సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
AA23 అప్డేట్..
MASSIVE! Three powerhouses of India, Icon Star @alluarjun, producer #BhushanKumar & director @imvangasandeep join forces. The movie under this association will be produced by @TSeries & #BhadrakaliPictures.#KrishanKumar @vangapranay @vangapictures #ShivChanana @neerajkalyan_24 pic.twitter.com/bUhXo6o8QN
— BA Raju's Team (@baraju_SuperHit) March 3, 2023