శనివారం 30 మే 2020
Cinema - May 17, 2020 , 15:47:56

త‌న తండ్రికి స్టైలిష్‌గా హెయిర్ క‌ట్ చేసిన హీరో

త‌న తండ్రికి స్టైలిష్‌గా హెయిర్ క‌ట్ చేసిన హీరో

లాక్‌డౌన్ వ‌ల‌న అనేక దుకాణాలు మూత ప‌డ్డాయి. దీని వ‌ల‌న ప్ర‌జ‌లు ప‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా బార్బ‌ర్ షాప్స్ మూత‌ప‌డ‌డంతో ప్ర‌తి ఒక్కరు దేవ‌దాసుల్లా మారుతున్నారు. అయితే కొంద‌రు మాత్రం స్వ‌యంగా హెయిర్ క‌ట్ చేసుకోవ‌డ‌మో లేదంటే వారి కుటుంబ స‌భ్యుల‌తో చేయించుకోవ‌డ‌మో చేస్తున్నారు. ఇప్ప‌టికే రాజ‌మౌళికి త‌న కూతురు హెయిర్ క‌ట్ చేయ‌గా, కోహ్లీకి అనుష్క చేసింది. 

తాజాగా టాలీవుడ్‌ యంగ్  హీరో సందీప్‌ కిషన్‌ తన తండ్రికి సోదరితో కలిసి స్వయంగా హెయిర్‌ కట్‌ చేశాడు. తన తండ్రిని స్టైలీష్‌ లుక్‌లోకి మార్చి అది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.  


logo