సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రిస్క్’. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. జీకే మిరాకిల్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాని జూన్ రెండోవారంలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
‘సంగీత దర్శకునిగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నేను దర్శకునిగా చేస్తున్న తొలి ప్రయత్నమిది. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాకు ‘రిస్క్’ అనే టైటిల్ యాప్ట్. ఉత్కంఠను కలిగించేలా సినిమా ఉంటుంది. టీమ్ అంతా అకింతభావంతో పనిచేశారు. మ్యూజిక్ కూడా బావుంటుంది’ అని ఘంటాడి కృష్ణ అన్నారు. ఇంకా హీరో సందీప్, 30ఇయర్స్ పృథ్వీ, మల్కాపురం శివకుమార్, అషురెడ్డి కూడా మాట్లాడారు.