నటి సంయుక్త మీనన్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామాకు ‘ది బ్లాక్ గోల్డ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యోగేష్ కె.ఎం.సి దర్శకుడు. రాజేశ్ దండా నిర్మాత. సంయుక్త మీనన్ స్వయంగా ఈ సినిమాను సమర్పిస్తున్నారు.
ఇది కొత్త కాన్సెప్ట్‌తో కూడుకున్న థ్రిల్లర్ అనీ, సంయుక్త డైనమిక్ పాత్రలో కనిపిస్తుందని, ఇందులో ఆమె యాక్షన్ సీన్స్‌లో కూడా నటించిందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి కెమెరా: ఎ.వసంత్, సంగీతం: సామ్.సిఎస్, సహ నిర్మాత: సింధు మాగంటి.