‘చేస్తున్న క్యారెక్టర్ని బట్టి ఆయన బిహేవియర్ ఉంటుంది. జోవియల్ క్యారెక్టర్ చేస్తుంటే సెట్లో కూడా జోవియల్‌గా ఉంటారు. అదే సీరియస్ క్యారెక్టర్ చేస్తుంటే సెట్లోనూ గంభీరంగా ఉంటారు. ఒక్కసారి మేకప్ వేసుకున్న తర్వాత పాత్రగా మారిపోతారు. అలాంటి యాక్టర్‌ని నేను ఇప్పటివరకూ చూడలేదు.’ అంటూ బాలకృష్ణను కొనియాడారు నటి సంయుక్త మీనన్. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ ‘అఖండ-తాండవం’ సినిమాలో కీలక భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్ర గురించి, బాలకృష్ణతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడింది సంయుక్త. ఇంకా చెబుతూ ‘బాలయ్యసార్ సినిమా అనగానే ముందు భయపడ్డా. ఆయన లెంజండరీ యాక్టర్. ఆయన కెరీర్లో సగం కూడా ఉండదు నా వయసు. హ్యాండిల్ చేయగలనా? అని సందేహించా. కానీ లొకేషన్లోకి వెళ్లాక, ఆర్టిస్టులను ఆయన ఓన్ చేసుకునే తీరు చూసి ఆశ్చర్యపోయా. తొలి గంటలోనే నా అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ‘నువ్వు మంచి యాక్టర్‌వి.. నీకు ఇది పెద్ద విషయం కాదు..’ అంటూ భుజం తట్టేవారు. ఇందులో నా పాత్ర రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా ఉండదు. విభిన్నంగా ఉంటుంది. అంతకు మించి చెప్పను.’ అన్నారు సంయుక్తా మీనన్.