రమాకాంత్, అవంతిక, భానుశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సముద్రుడు’. నగేష్ నారదాసి దర్శకుడు. కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై బదావత్ కిషన్ నిర్మిస్తున్నారు. ఈ నెల 25న విడుదకానుంది. ఇటీవల నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకకు సీనియర్ నటుడు సుమన్, దర్శకుడు సముద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ ‘మత్స్యకారుల జీవితాలకు దర్పణంగా ఈ సినిమాను తెరకెక్కించాం.
జాలర్లు చేపల వేటకు వెళ్లినప్పుడు పడే కష్టాలు, వారు ఎదుర్కొనే సమస్యలను ఈ సినిమాలో చూపించాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది’ అన్నారు. సుమన్, రాజ్‌ప్రేమి, రామరాజు, శ్రవణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నగేష్ నారదాసి.