Sammelanam OTT | టాలీవుడ్ నుంచి వస్తున్న ‘సమ్మేళనం’ అనే చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతుంది. నటులు ప్రియా వడ్లమాని (Priya Vadlamani), గణాదిత్య, వినయ్ అభిషేక్, శ్రీకాంత్ గుర్రం, నూతక్కి బిందు భార్గవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సమ్మేళనం’ (Sammelanam).
ఈ సినిమాకు తరుణ్ మహదేవ్ (Tharun Mahadev) దర్శకత్వం వహిస్తుండగా.. సునాయని.బి, సాకేత్.జె నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. సమ్మేళనం అనే పుస్తకం చుట్టూ తిరిగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తుంది. యుత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ ట్రైలర్‌ను మీరు చూసేయండి.
#Sammelanam – An ETV WIN original slice of the life film, releasing on 20th February. pic.twitter.com/RzhVcqy7bf
— Aakashavaani (@TheAakashavaani) February 14, 2025