Actress Sameera reddy | నరసింహుడు సినిమాలో పాలకడ్ పాపగా వయ్యారాలు ఒలికించిన సమీరా రెడ్డి గుర్తిందిగా. జై చిరంజీవలో శైలజగా, ఆశోక్ సినిమాలో అంజలిగా అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి కుటుంబానికి ఫుల్ టైమ్ కేటాయిస్తుంది. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ సౌత్‌లోని అన్ని లాంగ్వేజ్లతో పాటు బెంగాళిలోనూ నటించింది. చివరగా తెలుగులో రానా నటించిన కృష్ణవందే జగద్గురుమ్ సినిమాలో ఓ స్పెషల్ పాటలో నర్తించింది. ఇక ఇటీవలే ఈ బ్యూటీ నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ తెలుగులో రీ-రిలీజై మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
నటి సమీరా రెడ్డి కెరీర్ మంచి స్టేజ్‌లో ఉన్నప్పుడే అక్షయ్ వర్దేను పెళ్లి చేసుకుంది. వీళ్లది ప్రేమ వివాహం. అయితే తాను పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయిందంటూ అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. తాజాగా అందులో నిజం లేదని, పెళ్లి తర్వాతే బాబు పుట్టాడని చెప్పింది. అంతేకాకుండా అప్పుడు తను బాగా బరువు కూడా పెరిగానని, దాంతో చుట్టుపక్కల వాళ్లు తనకేమైంది కామెంట్ చేసేవాళ్లని తెలిపింది. ఇక వాళ్లకు బయపడి బయటకు వెళ్లడం కూడా మానేసినట్లు చెప్పుకొచ్చింది. సమీరాకు ఒక బాబు, పాప ఉన్నారు. నిత్యం సోషల్ మీడియాలో పలు ఫోటోలు, వీడియోలు పెడ్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది.