Yashodha Movie | గర్భిణీగా సమంత.. ఉత్కంఠ భరితంగా ‘యశోద’ టీజర్..!
Yashodha Movie Teaser | నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాల వేగాన్నిపెంచింది. వరుసగా సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ‘ఏమాయ చేశావే’ సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇటీవలే ఈమె నటించిన ‘కతు వాకుల రెండు కాదల్’ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈమె తెలుగులో మూడు సినిమాలలో నటిస్తుంది. అందులో ‘యశోద’ ఒకటి. హరీష్ శంకర్, హరీష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. టీజర్‌ను గమినిస్తే సమంత ప్రెగ్నెంట్ అని, మొదటి మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్ చెబుతుంది. నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండమని, బరువులు ఎత్తకూడదని, ఏ పని చేసిన దెబ్బ తగలకుండా చూసుకోవాలని, ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలని సలహాలు చెబుతుంది. అయితే డాక్టర్ చెప్పిన సలహాలకు పూర్తి భిన్నంగా సమంతను టీజర్లో చూపించారు. అడవిలో వేగంగా పరిగెత్తడం, బరువులు ఎత్తడం, ఎవరితోనే ఫైట్ చేస్తూ దెబ్బలు తినడం, భయపడటం వంటివి చేస్తున్నట్లు చూపించారు. ఇక సమంత నటన వేరే లెవల్లో ఉంది. అంతేకాకుండా సమంత కెరీర్లోనే ఛాలెంజింగ్ రోల్ ఇదేనని తెలుస్తుంది. సుకుమార్ కెమెరా విజువల్స్ థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తున్నాయి. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. అయితే ఈ చిత్రం ఆగస్టు 12నే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది.
Read Also:
Suriya 42 | యుద్ధ వీరుడిగా సూర్య.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘సూర్య42’ మోషన్ పోస్టర్
Allu Arjun | ఆ పాన్ ఇండియా దర్శకుడితో అల్లుఅర్జున్ నెక్స్ట్ చిత్రం?
RC15 Movie | శంకర్-రామ్‌చరణ్ మూవీలో తమిళ స్టార్ డైరెక్టర్..!
Ahimsa Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న తేజ ‘అహింస’ గ్లింప్స్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Illegal Arrest | బీఆర్ఎస్ నాయకుడు బాలరాజు యాదవ్ అక్రమ అరెస్ట్
OPPO Smart Phone | ఒప్పో నుంచి బ్యాటరీ బాంబ్.. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్!
Supreme Court: 3 రాష్ట్రాల మధ్య 60 ఏళ్లుగా విద్యుత్తు వివాదం.. పరిష్కరించిన సుప్రీంకోర్టు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

