Yashoda Glimps | వినూత్న కథలను ఎంచుకుంటూ వైవిధ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ‘ఏమాయ చేశావే’ సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇటీవలే ఈమె నటించిన ‘కతు వాకుల రెండు కాదల్’ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈమె తెలుగులో మూడు సినిమాలలో నటిస్తుంది. అందులో యశోద ఒకటి. హరీ, హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేసింది.
గ్లింప్స్‌ను గమనిస్తే.. సమంత ఓ హస్పిటల్ బెడ్‌పై నుంచి సడెన్‌గా లేచి చేతికి ఉన్న బాండ్‌ను ఆశ్చర్యంగా చూస్తుంది. తరువాత కిటీకి బయట ఉన్న పావురాన్ని తాకబోతుంది. వెంటనే యశోదా టైటిల్ వస్తుంది. కథపై ఎలాంటి క్లూ ఇవ్వకుండా ఎలాంటి డైలాగ్స్ లేకుండా మేకర్స్ ఈ గ్లింప్స్‌ను కట్ చేశారు. ఇక ఈ గ్లింప్స్‌ని చూస్తే సమంత ఇమాజినరి ప్రపంచంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం సమంతకు మొదటి పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఆగస్టు 12న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది.