పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పోలీసుల వేధింపులు తాళలేక ఓ చిరు హోటల్ నిర్వాహకుడు పోలీస్‌స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
భీమ్‌గల్: పోలీసుల వేధింపులు తాళలేక ఓ చిరు హోటల్ నిర్వాహకుడు పోలీస్‌స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ బస్టాండ్‌లో హోటల్ నిర్వహిస్తున్న పొలాస సుధాకర్‌ను లేట్‌నైట్ వరకు హోటల్ నడుపుతున్నారంటూ పోలీసులు పలుమార్లు ప్రశ్నించి జరిమానాలు విధించినట్లు ఆరోపించారు.
ఇప్పటికే తనపై మూడుసార్లు ఫైన్ వేసినట్లు సుధాకర్ తెలిపారు. తాజాగా జరిమానా విధించిన పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని, కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి రావాలని ఆదేశించినట్లు చెప్పారు. తాను చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇతర దుకాణాలు కూడా తెరిచి ఉన్నప్పటికీ వారిని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. అయితే ఘటనపై పోలీసులు అధికారికంగా ఏమి చెప్పారన్నది తెలియాల్సి ఉంది. బాధితుడి ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేసి, వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Tabu | నాగార్జున ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్.. టబు పాత్ర గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
మహిళలు భయం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

