Shaakuntalam | సమంత ‘శాకుంతలం’ విడుదలయ్యేది అప్పుడేనా?
Shaakuntalam Release Date | నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాల వేగాన్ని పెంచింది. ఓ వైపు వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం సమంత చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో 'శాకుంతలం' ఒకటి.
Shaakuntalam Release Date | నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాల వేగాన్ని పెంచింది. ఓ వైపు వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం సమంత చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘శాకుంతలం’ ఒకటి. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన సమంత ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
శాకుంతలం సినిమాను ఇదే ఏడాది డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో విడుదల చేయాలని గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఓ ప్లాన్‌ను కూడా ప్రిపేర్ చేశాడట. ఆ ప్లాన్ ప్రకారమే షూటింగ్‌ను పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడట. ఇక ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కుమార్తె అల్లు అర్హ కీలక పాత్రలో నటించనుంది. దిల్‌రాజు సమర్పణలో గుణ టీంవర్క్స్ బ్యానర్‌పై నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

