సమంత కథానాయికగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకులు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే థ్రిల్లర్ చిత్రమిది. అనూహ్యమైన మలుపులతో కథ సాగుతుంది.
సమంత గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపిస్తుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నది. డబ్బింగ్ కార్యక్రమాల్ని మొదలుపెట్టబోతున్నాం. త్వరలో విడుదల తేదీని తెలియజేస్తాం’ అని తెలిపారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీశర్మ, సంపత్‌రాజ్, శత్రు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్బెన్, మాటలు: పులగం చిన్నారాయణ, డా॥ చల్లా భాగ్యలక్ష్మి, సంగీతం: మణిశర్మ, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి-హరీష్.