Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తమిళ అమ్మాయి అయిన కూడా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు విడిపోయి చాలా ఏళ్లు గడిచిపోయిన కూడా ఇప్పటికీ చాలా మంది తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. చైతూ మరో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన కూడా సామ్ పెళ్లి చేసుకోకుండానే ఎప్పటిలాగే తన కెరీర్ మీద ఫోకస్ పెట్టింది.
ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత అదే సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించాడు. ఈ సినిమా తర్వాత చై, సామ్ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లకే ఈ జంట విడిపోయారు. ఈ ఇద్దరూ ఎందుకు విడిడిపోయారో ఇప్పటికీ ఎవరు తెలియరావడం లేదు. అయితే నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత మాయోసైటిస్ బారినపడిన విషయం తెలిసిందే. ఇప్పడిప్పుడు సామ్ మాయోసైటిస్ నుంచి కోలుకుంటుంది. ఇక సినిమాలకు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు.. తిరిగి సినిమాల్లోకి వచ్చి సందడి చేసేందుకు సిద్ధమైంది.
ఇటీవలే శుభం అనే సినిమాను కూడా పూర్తిచేసింది. ఇందులో సమంత కీలక పాత్రలో కనిపించి అలరించనుంది. అయితే చై – సామ్ విడాకులు తీసుకున్నా, కొన్ని విషయాలు మాత్రం ఇప్పటికీ వీరిద్దరికీ ముడిపడి ఉన్నాయి. అవేంటంటే.. హాష్, ఒంటి మీదున్న టాటూలు. ఇద్దరు విడిపోయినా, వీరి ప్రేమ బంధానికి గుర్తుగా వేసుకున్న టాటూలు మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత గత ఏడాది ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అనే సెషన్ ని అభిమానులతో ఇంటరాక్ట్ అయింది. ఈ సెషన్ లో అభిమానులు ఆమెని అనేక ప్రశ్నలు అడిగారు. అందులో ఒక అభిమాని ‘ప్రేమికులు టాటూలు వేయించుకోవడం పై మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడగగా దానికి ఆమె సమాధానం చెప్తూ ‘నా అభిమానులకు ఈ సందర్భంగా ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ప్రేమించుకుంటే ప్రేమించుకోండి పర్లేదు కానీ, టాటూ మాత్రం వేయించుకోవద్దు, ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి’ అని చెప్పుకొచ్చింది. అంటే సమంత.. నాగ చైతన్య టాటూ వేసుకొని తప్పు చేసిందా అనే దానిపై చర్చ నడుస్తుంది.