ఇటీవలే ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది అగ్ర కథానాయిక సమంత. ఈ సినిమా విజయోత్సాహంలో ఉన్న ఈ భామ టాక్‌షో హోస్ట్‌గా అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో ఈ టాక్‌షో స్ట్రీమింగ్ కానుంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటిదాక వచ్చిన టాక్‌షోలకు భిన్నంగా దీనిని డిజైన్ చేశారని తెలిసింది.
కేవలం మహిళా సెలబ్రిటీలే ఈ షోకు గెస్ట్లుగా వస్తారట. సినీరంగంలోని వివిధ విభాగాల్లోని ఫీమేల్ టెక్నీషియన్స్ జీవితాలను, వృత్తిపరంగా వారు ఎదుర్కొనే కష్టాలను ఈ షో ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. ఈ సరికొత్త ప్రాజెక్ట్ గురించి సమంత సోషల్‌మీడియాలో స్పందించింది. ‘మార్పును స్వీకరించడం, ప్రయాణాన్ని నమ్మడం, కొత్త ఆరంభాలకు స్వాగతం పలకడం వంటి విషయాలను ఈ ఏడాది నాకు గుర్తుచేసింది. సోనీ లివ్‌తో కలిసి ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని సమంత పేర్కొన్నది.