e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home News Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?

Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?

టాలీవుడ్ బెస్ట్ జోడిగా సమంత నాగచైతన్య గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరి విడాకులతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో షాక్ అయ్యింది. వీరిద్దరూ కలిసి విడాకులు తీసుకున్నా.. సామ్ నే ఎక్కువగా తప్పు పట్టారు. సోషల్ మీడియాలో ఆమె మీదే ఎక్కువగా ట్రోల్స్ వచ్చాయి. సమంతకు ఎఫైర్స్ ఉన్నాయని, సెల్ఫిష్ అని, డబ్బుకే ప్రాధాన్యత ఇస్తుందని, అసలు పిల్లలు వద్దనుకున్నారని ఇలా ఎన్నో రకాలుగా కామెంట్స్ వచ్చాయి. లేటెస్ట్ గా సమంత, నాగచైతన్య కోసం చేసిన త్యాగాలు గురించి మాట్లాడుకుంటున్నారు.

సామ్, చైతూలు విడాకుల తర్వాత ఎవరి కెరీర్ తో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే సమంత పెళ్ళి జరిగినప్పటి నుండే కాకుండా నాగచైతన్యతో రిలేషన్ లో ఉన్నప్పటి నుండి చేసిన త్యాగాలను ఇప్పుడిప్పుడే బయటకు తీసుకొస్తున్నారు నెటిజన్లు. సమంత పిల్లల్ని కనాలనే ఉద్దేశ్యంతోనే కొత్తగా సినిమాలు ఒప్పుకోలేదు. బాలీవుడ్ నుండి షారుఖ్ హీరోగా అట్లీ డైరెక్షన్ చేస్తున్న సినిమా నుండి సామ్ కి ఓ ఆఫర్ వచ్చింది. ఈ సినిమా ప్రపోజల్ ని కూడా పిల్లల కోసమే వద్దనుకుందని ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది.

- Advertisement -

ఈ సినిమాలో ప్రస్తుతం సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. ఈమె కన్నా ముందు అట్లీ సామ్ ని అడిగారట. కానీ సామ్ ఫ్యామిలీ ఫ్లాన్ చేసుకోవడానికి బిగ్గెస్ట్ ఆఫర్ ని సైతం ఒప్పుకోలేదు. అలాగే తన మీద వస్తున్న రూమర్స్ గురించి సామ్ తో పాటు కోన నీలిమ లాంటి వారు క్లారిటీ ఇచ్చారు. కనుక సామ్ తప్పు చేసింది అనే పాయింట్ నుండి తన చైతూ కోసం ఎన్ని త్యాగాలు చేసిందనే యాంగిల్ లో సమంతకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement