Samantha | అందాల ముద్దుగుమ్మ సమంత ఇటీవల సినిమాల స్పీడ్ తగ్గించింది. దీంతో జనాలతో ఇంటరాక్షన్ కూడా తగ్గింది. గతంలో అంటే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేదంటే సినిమా ప్రమోషన్స్ సమయంలో కనిపించి సందడి చేసేది. కాని ఇప్పుడు అలా లేదు. స్లో అండ్ స్టడీగా వెళుతుంది. స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫామ్ లో ఉన్న టైంలోనే సడెన్ గా బ్రేక్ తీసుకున్నారు సమంత. హెల్త్ ఇష్యూ కారణంగా కెరియర్ లో లాంగ్ బ్రేక్ తీసుకోవడం, అదే సమయంలో ఓటీటీ ఆఫర్స్ రావడంతో సిల్వర్ స్క్రీన్ కు మరింత గ్యాప్ ఇచ్చారు చెన్నై చంద్రం. ఇక సమంత ఇప్పుడు నటి మాత్రమే కాదు నిర్మాత కూడా. ఓవైపు ఓటీటీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ , తను స్వయంగా నటించే సినిమాతోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని భావించింది. కాని ఆ ప్రాజెక్ట్ డిలే కావడంతో శుభం అనే చిన్న సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఇందులో ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రియ కొణతం, షాలిని కొండేపూడి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హారర్ కామెడీ సినిమాగా చిత్రాన్ని రూపొందించారు. మే 9న వరల్డ్ వైడ్‌గా విడుదల కానున్నఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ స్పీడ్ పెంచింది. మే 4న వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ ఈవెంట్‌కి సమంత హాజరు కానుందా, వస్తే తన సినిమాల గురించి ఏవైన అప్డేట్స్ ఇస్తుందా, ఎలాంటి ఆసక్తికర విషయాలు పంచుకోబోతుంది అని ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నిర్మాతగా సక్సెస్‌లు సాధించలేక చాలా మంది వెనకడుగు వేస్తున్న సమయంలో సమంత ఓ అడుగు ముందుకేసి నిర్మాతగా మారింది. లైఫ్ లో రిస్క్ తీసుకోకపోతే ముందుకు వెళ్ళలేమంని చెబుతుంది. ఒకప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే భయపడేదాన్ని , ఇప్పుడు ఆ భయం లేదంటుంది.