అందాల ముద్దుగుమ్మ సమంత.. చైతూ నుండి విడిపోయిన తర్వాత చాలా బిజీగా మారేందుకు ప్రయత్నిస్తుంది. వరుస సినిమాలు ఒప్పుకుంటూ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా సమంత ఓ హాలీవుడ్ సినిమాకు పచ్చజెండా ఊపింది. గత కొద్దిరోజులుగా సమంత ఓ హాలీవుడ్ చిత్రంలో నటించబోతోందని సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు షికారు చేశాయి. ఇక వాటిని నిజం చేస్తూ సామ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా ఆ వివరాలను తెలియజేసింది.
అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ పేరుతో ఆమె ఓ ఇంటర్నేషనల్ మూవీ చేయనుండగా, ఇది హాలీవుడ్ మూవీ డౌన్ టౌన్ అబేను రూపొందించిన ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో బై సెక్సువల్గ సమంత కనిపించనుంది. ఇది తనకు ఛాలెంజింగ్ పాత్ర అంటుంది.
ఇదిలా ఉంటే సమంత తాజాగా బాలీవుడ్, దక్షిణాదికి చెందిన పలువురు తారలతో ఇటీవల ఓ ఛానల్ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. తాప్సీ, విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్రతోపాటు నటి సమంత ఈ సరదా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. డిసెంబర్ 6న ఈ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ఓ స్పెషల్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో 2021 ఎలా గడిచిందో ఒక్కమాటలో చెప్పాలని తారల్ని కోరగా.. సమంత మాట్లాడుతూ.. ‘‘తన జీవితంలో 2021 ఓ క్లిష్టమైన ఏడాది’’ అని తెలిపారు. అంటే సామ్ ఇంకా పాత జ్ఞాపకాలలోనే ఉన్నట్టు అర్ధమవుతుంది.