టాలీవుడ్ (Tollywood)స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం యశోద (Yashoda). హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను స్టార్ హీరో విజయ్ దేవరకొండ లాంఛ్ చేశాడు.
‘మీకెప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా..? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది..’అని సమంత డైలాగ్స్ తో మొదలైంది ట్రైలర్. నువ్వు కనే బిడ్డ ఏ బిలియనీర్ ఇంటికో వెళ్తుందని అంటోంది డాక్టర్ వరలక్ష్మి శరత్‌కుమార్.
పేదరికంలో ఉన్న యశోద (సమంత పాత్ర) డబ్బు కోసం సరోగసి పద్దతిలో బిడ్డను కనివ్వడానికి ఒప్పుకున్నట్టు అర్థమవుతుండగా.. ఆ క్రమంలో ఆమె జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది.
‘యశోద ఎవరో తెలుసు కదా.. ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి’ అంటూ సమంత చివరలో చెబుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
పాన్ ఇండియా కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ, తమిళం, హిందీ భాషల్లో వస్తుండగా.. ఆయా భాషల ట్రైలర్స్‌ను రక్షిత్ శెట్టి, దుల్కర్ సల్మాన్, సూర్య, వరుణ్ ధవన్ లాంఛ్ చేశారు.
తెలుగు ట్రైలర్ ..
తమిళ ట్రైలర్ ..