అగ్ర కథానాయిక సమంత సినీ రంగంలో పదిహేనేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ‘ఏమాయ చేసావె’ చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది సమంత. ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని, అయినా ఏ రోజూ అధైర్యపడలేదని, జీవితంలోని ప్రతీ దశను ఆస్వాదించానని చెప్పింది. ‘అప్పుడే 15ఏళ్లు గడచిపోయాయంటే నమ్మశక్యంగా లేదు. నా జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్స్ అన్నింటినీ చూశాను. కొన్ని సంక్షోభాలను కూడా ఎదుర్కొన్నా. ఇప్పుడు మరింత పరిణితి సాధించాను. జీవితంలో దేనినైనా ఎదుర్కోగలననే నమ్మకం ఏర్పడింది’ అని సమంతా తెలిపింది. తన తొలి చిత్రం ‘ఏ మాయ చేసావె’ గురించి మాట్లాడుతూ ‘ఆ సినిమాలోని ప్రతీ సీన్ ఇప్పుటికీ నాకు గుర్తుంది. కార్తీక్‌ను గేటు దగ్గర కలిసే సీన్‌ను ఫస్ట్‌షాట్‌గా తీశారు. దర్శకుడు గౌతమ్‌మీనన్‌తో పనిచేయడం ఓ అద్భుతమైన అనుభూతి. నా కెరీర్లో బెస్ట్ చిత్రాల్లో ‘ఏ మాయ చేసావె’ ముందు వరుసలో ఉంటుంది’ అని సమంత ఆనందం వ్యక్తం చేసింది.