Samantha | సౌతిండియా స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరుతో ఆమె సోమవారం వివాహ బంధంలోకి అడుగుపెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడులోని ఈషా ఫౌండేషన్ యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవి ఆలయంలో భూతశుద్ధి సంప్రదాయంలో జరిగిన ఈ వివాహం ప్రత్యేకమైనదిగా పండితులు పేర్కొంటున్నారు. సమంత-రాజ్ నిడిమోరు పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో పూర్తిగా ప్రైవేట్‌గా జరిగినప్పటికీ, ఫోటోలు బయటకు రాగానే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టడంతో #Samantha, #RajNidimoru హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి.
నాగచైతన్యతో విడాకుల తర్వాత కొంతకాలం అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న సమంత, అనంతరం నటిగానే కాక నిర్మాతగా కూడా బిజీ అయింది. ఈ క్రమంలో రాజ్ నిడిమోరుతో సాగిన పరిచయం ప్రేమగా మారి చివరకు వివాహ బంధంగా మారిందని ఇండస్ట్రీ టాక్.ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కినీ గతంలో సమంత గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. 2023 జూన్ 27న ఆయన చేసిన ట్వీట్లో .. సమంత 2024లో ప్రేమలో పడుతుంది, 2025లో రెండో పెళ్లి చేసుకుంటుంది, 2026లో భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అవుతుంది అని పేర్కొన్నారు. ఈ జోష్యంలో ముందటి రెండు విషయాలు నిజమవడంతో, ఇప్పుడు మూడో అంశం సమంత 2026లో అమెరికాకు వెళ్లి సెటిల్ అవుతుందా? అని నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్రశాంత్ కినీ కూడా తాజాగా స్పందిస్తూ, సమంత విషయంలో నేను చెప్పిన జ్యోతిష్యం నిజమైంది అని మరోసారి పోస్ట్ చేశారు. అయితే సమంత 2026లో అమెరికాలో సెటిల్ అయితే…ఆమె సినిమాలకు గుడ్‌బై చెబుతుందా? ఇకపై టాలీవుడ్ ప్రాజెక్టుల్లో కనిపించదా? అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “జోష్యం విషయంలో రెండు నిజమైయినా, మూడోది మాత్రం నిజం కాకూడదు” అనే కామెంట్లు వరదలా వస్తున్నాయి.