నటిగా ఓ వెలుగు వెలిగిన సమంత.. ఇప్పుడు నిర్మాతగా కూడా బిజీ అవుతున్నారు. రీసెంట్గా ‘శుభం’తో ఆమె సక్సెస్ అందుకున్నారు. సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా పతాకంపై ఆమె నటిస్తూ నిర్మిస్తున్న ‘రక్తబ్రహ్మాండ్’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
ఇకపై సెలక్టీవ్‌గా సినిమాలు చేయాలని ఈ అందాలభామ నిర్ణయించుకున్నారట. ప్రముఖ మ్యాగజైన్ ‘గ్రాజియా ఇండియా’ లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీపై మెరిసిన ఈ అందం.. ఆ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
‘ఎన్ని సినిమాలు చేశామనేది ముఖ్యం కాదు.. ఎన్ని మంచి సినిమాలు చేశామనేది ముఖ్యం. ఇకపై మనసుకు నచ్చిన కథల్లోనే నటిస్తా. ఒకేసారి అయిదారు సినిమాలు ఇక చేయను. శరీరం చెప్పేది అందరం వినాలి. శారీరక, మానసిక ఆరోగ్యమే మనిషికి ముఖ్యం. అయితే.. ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా.. నాణ్యత విషయంలో మాత్రం రాజీ పడను.’ అని తెలిపారు సమంత.