Samantha | సమంత గతేడాది మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరిని షాక్‌కు గురిచేసింది. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ తను సక్సెస్ అని నిరూపించుకుంటుంది. ఈ వ్యాధి కారణంగా గతకొన్ని నెలలుగా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ఫ్యామిలీమ్యాన్ రూపకర్తలు తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ కోసం కెమెరా ముందుకు వచ్చింది. దీనితో పాటు ఖుషీ షూటింగ్‌లోనూ పాల్గొంటుంది. ఆ అరుదైన వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నట్లు సమంత ఇటీవలే చెప్పింది.
కాగా తాజాగా జరిగిన ఓ సంఘటనను చూస్తే సామ్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని తెలుస్తుంది. ప్రస్తుతం సామ్ నటించిన శాకుంతలం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం సమంత వరుస ప్రమోషన్లు చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తుంది. కాగా తాజాగా శాకుంతలం త్రీడి ట్రైలర్ విడుదల కోసం ముంబైకి చేరుకున్న సమంత.. ఫొటోల వల్ల కాస్త అసౌకర్యానికి లోనయ్యింది. ఫ్లాష్ చూడలేక ఇబ్బంది పడింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఫోటోగ్రాఫర్స్ ఫ్లాష్ తో సమంతను ఫొటో తీయడంతో తన చేతులతో ముఖాన్ని కవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపించింది. దాంతో పలువురు నెటీజన్లు సమంత ఆరోగ్యం ఇంకా కుదుపటడలేదని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం సామ్ నిర్వారామంగా శాకుంతలం ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతుంది. ప్రమోషన్లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక ఇటీవలే ఓ ప్రమోషన్లో హీరో నాగ చైతన్యతో విడాకుల అంశంపై స్పందించి.. తాను తన వైవాహిక బంధంలో 100 శాతం ఇచ్చినా వర్కవుట్ కాలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక అదే సమయంలోనే ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ పైనా పలు కామెంట్స్ చేశారు. తనను ఆ సాంగ్ చేయ్యొద్దని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పారని సామ్ అన్నది. కానీ తాను తప్పేం చేయట్లేదని, ఏం నేరం చేయని తాను ఎందుకు ఇలా దాక్కోవాలి అని నిర్ణయించుకొని ‘ఊ అంటావా..’ సాంగ్ చేశానని సామ్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం సామ్ నటించిన శాకుంతలం ఏప్రిల్ 14న పాన్ ఇండియ ఆ స్థాయిలో రిలీజ్ కానుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే నవల ఆధారంగా తెరకెక్కింది. శకుంతల పాత్రలో సమంత నటించగా.. దుష్యంతుడి పాత్ర దేవ్ మోహన్ పోషిస్తున్నాడు. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి.