అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సిరీస్ ‘సిటాడెల్’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నది సమంత. ఇదే పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్లో తాజాగా అడుగుపెట్టిందీ నాయిక. ఈ సందర్భంగా సిటాడెల్లోని సమంత క్యారెక్టర్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ైస్టెలిష్ మేకోవర్‌లో సమంత ఆకట్టుకుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు దర్శక ద్వయం రాజ్, డీకే ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు.
వీరు తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత రాజి అనే కీలక పాత్రలో నటించి పేరు తెచ్చుకుంది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సిటాడెల్ షూటింగ్ నార్త్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత సెర్బియా, దక్షిణాఫ్రికాలో చిత్రీకరణ చేయబోతున్నారు. సమంత లుక్ రిలీజ్ సందర్భంగా దర్శకద్వయం రాజ్ డీకే స్పందిస్తూ…‘సమంతతో మరోసారి కలిసి పనిచేస్తుండటం ఉద్వేగంగా ఉంది. సెట్లో పవర్హౌస్లా కనిపించే ఆమెకు స్వాగతం చెబుతున్నాం’ అని పేర్కొన్నారు.