తన ఇన్‌స్టా ద్వారా అభిమానులకు నాలుగు మంచి మాటలు చెబుతూ ఉంటారు అగ్ర కథానాయిక సమంత. రీసెంట్గా తన ఇన్‌స్టా ద్వారా అభిమానులకు ఓ విలువైన సందేశాన్ని పంపారామె. ‘ఇతరుల మాటలు పట్టించుకొని ప్రశాంతతను పాడు చేసుకోవద్దు. ‘ఏదైతే అది కానీ’ అనే ధోరణితో ఉంటే ప్రశాంతత లభించదు. పాజిటివ్‌గా ఆలోచిస్తేనే ప్రశాంతత. దానికి సాధన అవసరం.
‘నేను చేయాల్సింది..’ అనే మాటను ‘నేను తప్పకుండా చేసి తీరాల్సిందే..’ అనే విధంగా మార్చుకుంటే విజయం మన వెంటే ఉంటుంది. ఆత్మ సంఘర్షణ ఆరోగ్యానికి మంచిది కాదు. మనసు వేగంతో కాదు.. నిశ్చలత్వంతోనే ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఒత్తిళ్లు మన గౌరవానికి అవరోధం కాకూడదు.’ అంటూ రాసుకొచ్చింది సమంత.