Samantha | ఆరోగ్యం కోసం ఐదు సూత్రాలు.. సమంత మార్నింగ్ రొటీన్ ఇదీ
Samantha | స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన మార్నింగ్ రొటీన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది (Morning routine). ఆరోగ్యం కోసం తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వివరించింది.
Samantha | స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, అభినయంతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా నిలిచింది. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ సామ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సామ్.. గత కొన్ని రోజులుగా మయోసైటిస్ (Myositis)తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాన్నుంచి పూర్తిగా కోలుకునేందుకు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టింది. అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఒక పాడ్ కాస్ట్ కూడా ప్రారంభించింది. అందులో ఆరోగ్యంతోపాటు తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది.
తాజాగా తన మార్నింగ్ రొటీన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది (Morning routine). ఆరోగ్యం కోసం తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వివరించింది. ఉదయం ఎన్ని గంటలకు మేలుకుంటోంది.. లేచాక ఏమేం చేస్తుందనే ప్రతి విషయాన్ని పాడ్ కాస్ట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘నేను ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాను. లేవగానే జర్నలింగ్ ( journaling)తో నా రోజును ప్రారంభిస్తాను. గ్రాటిట్యూడ్ జర్నల్ (gratitude journal) రాస్తాను. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు సూర్య కిరణాలను ఆస్వాదిస్తాను.
ఆ తర్వాత బ్రీత్ ఎక్సర్సైజ్లు చేస్తాను. ఇందు కోసం నేను విమ్ హోఫ్ మెథడ్ (Wim Hof method) ఫాలో అవుతాను. నేను గత కొంతకాలంగా ఇషా క్రియా చేస్తున్నాను. 25 నిమిషాల పాటు మెడిటేషన్ చేస్తాను. అలాగే కొద్ది నెలలుగా టాపింగ్ చేయడం (తలపై చేతి వేళ్లతో మసాజ్‌లా చేయడం) ప్రారంభించాను. ఇలా చేయడం వల్ల మన ఎనర్జీ బ్యాలెన్స్ చేయడానికి సాయపడుతుంది. దీని వల్ల పెయిన్స్ నుంచి రిలీవ్ ఉంటుంది. సో.. జర్నలింగ్, సన్ సోక్, విమ్ హోఫ్, మెడిటేషన్, ట్యాపింగ్. ఈ ఐదింటి వల్ల జీవితంలో గొప్ప మార్పులు జరుగుతాయి’ అంటూ తన మార్నింగ్ రొటీన్ గురించి సామ్ వివరించింది.
Also Read..
Aishwarya Rajinikanth | విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఐశ్వర్య-ధనుష్ దంపతులు
Allu Arjun | అర్ధరాత్రి అల్లు అర్జున్ ఇంటి వద్ద ఫ్యాన్స్ సందడి.. వీడియోలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

