Samantha | ఇటీవలకాలంలో వరుస ఇంటర్వ్యూల్లో ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నది అగ్ర కథానాయిక సమంత. తాజాగా ఈ భామ తనపై వచ్చిన ఓ తప్పుడు వార్తపై ట్విట్టర్ వేదికగా స్పందించింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల డేటింగ్ గురించి తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు వచ్చిన కథనంలో ఏమాత్రం నిజం లేదని పేర్కొంది. యువ నాయిక శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నారని కొద్దిరోజులగా వార్తలు వస్తున్నాయి.
వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వీరి లవ్ ఎఫైర్‌పై సమంత స్పందించిందని ఓ మీడియా సంస్థ వార్తను ప్రచురించింది. కొందరు ఎన్ని ప్రేమాయణాలు నడిపినా ప్రయోజనం ఉండదని, విలువలు లేని ప్రేమలు కన్నీళ్లతోనే ముగుస్తాయని సమంత చెప్పినట్లు సదరు మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. అయితే తాను అలాంటి మాటలు అనలేదని, నిరాధారమైన కథనం అంటూ సమంత ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రం ఈ నెల 14న విడుదలకానుంది.