Samantha | నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత పూర్తిగా మారిపోయింది. తన లైఫ్ ను చాలా పర్టికులర్ గా డిజైన్ చేసుకుంటుంది. కావాలనుకున్నప్పుడు మాత్రమే సినిమాలు చేస్తూ.. మిగిలిన టైం లో తన లైఫ్ ఎంజాయ్ చేస్తుంది సమంత (Samantha). అందుకే మరో ఏడాది వరకు సినిమా లేదు ఒప్పుకోలేదు ఈమె. పనిలో పనిగా ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి విదేశాలు కూడా తిరుగుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇవన్నీ ఇలా ఉంటే తన మాజీ భర్త నాగచైతన్య (Naga Chaitanya)ను మర్చిపోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది ఈ భామ.
ఆయన నుంచి దూరం అయిపోయిన తర్వాత కూడా తన గుర్తులు ఇంకా సమంతను వదిలిపెట్టడం లేదు. చైతుతో కలిసి ఉన్నప్పుడు పర్మినెంట్ ట్యాటూలు వేయించుకున్నారు వీళ్లిద్దరు. అప్పట్లో వీళ్ల టాటూల గురించి మీడియాలో చర్చ బాగానే జరిగింది. అయితే సమంతతో విడిపోయిన తర్వాత కూడా చేయితో చేతి మీద గుర్తులు అలాగే ఉండిపోయాయి. అలాగే సమంత కూడా వాటిని మెయింటైన్ చేస్తూ వచ్చింది. దాన్నిబట్టి చైతుని ఇంకా మర్చిపోలేక పోతుంది అనే విషయం అర్థమైంది. కాకపోతే ఇప్పుడు ఆ మిగిలిన గుర్తులు కూడా తన ఒంటి మీద ఉండకుండా చూసుకుంటుంది సమంత.
తాజాగా సమంత చేసిన ఫోటోషూట్ లో తన పాత గుర్తులు ఏవి ఆమె ఒంటి మీద కనిపించడం లేదు. ముఖ్యంగా నడుము పై భాగంలో ఎదకు దగ్గరలో చైతు పేరును అప్పట్లో ట్యాటూ వేయించుకుంది ఈ ముద్దుగుమ్మ. విడాకులు వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు అది అలాగే ఉంది. కానీ ఇప్పుడు చేసిన ఫోటోషూట్ లో అది కనిపించడం లేదు. దాన్ని బట్టి నాగచైతన్య గుర్తులు ఏవి తన దగ్గర ఉండకూడదని మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
అలా ఉంటే అనవసరంగా డిస్టర్బ్ అవ్వడం తప్ప ఇంకేం లేదు అనుకుంటుంది. అందుకే ఆ గుర్తులు పూర్తిగా చెరిపేస్తుంది. ప్రస్తుతం ఈమె యూరోపియన్ టూర్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడి నుంచి అమెరికా వెళ్లాలని సన్నాహాలు చేసుకుంటుంది. అక్కడే కొన్ని రోజులు ఉండి మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుని.. ఆ తర్వాత ఇండియాకు వచ్చి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేయనుంది. ఈ మధ్యే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.