టాలీవుడ్ (Tollywood) భామ సమంత (Samantha) , నాగచైతన్య (Naga Chaitanya) తో పెండ్లయిన తర్వాత కూడా విజయవంతంగా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించింది. అయితే ఇటీవలే చైతూ, సామ్ విడిపోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. చైతూతో విడిపోయిన తర్వాత సమంత ఏం ప్లాన్స్ చేస్తుందంటూ అందరూ తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా పూర్తి చేసింది. మరోవైపు సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad)తో ఓ సినిమా చేయనుందని టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే సామ్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఇపుడు సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది. సమంత ఒకేసారి మూడు ప్రాజెక్టులకు సంతకం చేయనుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు దీనిపై అధికారిక ప్రకటన కూడా వారం, రెండు వారాల్లో బయటకు రాబోతుందట. మరి ఇదే నిజమైతే ఈ మూడు చిత్రాలు తెలుగులోనేనా..? వేరే భాషవా..? అనేది తెలియాల్సి ఉంది.
చాలా మంది నిర్మాతలు బోల్డ్ కథాంశంతో కూడిన స్క్రిప్ట్‌లతో సామ్ ను సంప్రదించేందుకు రెడీగా ఉన్నా..ఆమెకు పెళ్లయిన దృష్ట్యా ఆ కథనాలు వినిపించడంలో వేచి చూసే ధోరణిని ఫాలో అవుతున్నారు. అయితే ఇపుడు చైతూతో వివాహ బంధాన్ని తెంచుకోవడంతో దర్శకనిర్మాతలకు కూడా పూర్తి స్వేచ్చ దొరికినట్టైందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు సినీ జనాలు.
Samantha | అమ్మో సమంత అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా?
Samantha: పెళ్లి రోజు పోస్ట్ పెట్టిన సమంత.. అందులో ఏం చెప్పిందంటే..!
Tamannaah | అలా మారడం కష్టమైన పని : తమన్నా
Nagendra Babu | నరేశ్ది నరం లేని నాలుక..అందరి కోసం ‘మా’ : నాగబాబు
Chaitan Bharadwaj | మహాసముద్రంలో చాలా ట్విస్టులుంటాయి: చేతన్ భరద్వాజ్