Samantha -Raj | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా హైలైట్ అవుతోంది. తెలుగులో కొత్త సినిమాలు చేయకపోయినా, సమంత ఏదో ఒక కారణంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూనే ఉంది. తాజాగా ఆమె రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, సమంత ప్రస్తుతం నిర్మాత రాజ్ నిడిమోరు (D2R Films ఫేమ్)తో డేటింగ్ చేస్తుందట. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై అధికారిక నిర్ధారణ ఏదీ లేకపోయినా, ఇద్దరి మధ్య బంధం ఉందనే సంకేతాలు సామ్ స్వయంగా ఇస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో సమంత ఎక్కడ ఉంటే, రాజ్ అక్కడే కనిపిస్తున్నాడు. ఈవెంట్లు, పబ్లిక్ ఫంక్షన్లు, వెకేషన్లు ఇలా ప్రతీ సందర్భంలోనూ వీరిద్దరూ కలిసే దర్శనమిస్తున్నారు. ఇటీవల సమంత తన కొత్త పెర్ఫ్యూమ్ బ్రాండ్ ‘సీక్రెట్ అల్కమిస్ట్’ ప్రారంభ వేడుకలో పాల్గొంది. ఈ గ్రాండ్ ఈవెంట్లో బడా వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఈవెంట్ ఫోటోల్లో ప్రత్యేకంగా ఆకట్టుకున్నది సమంత–రాజ్ కౌగిలి ఫోటో. చేతిలో విస్కీ గ్లాస్ పట్టుకుని, సామ్ నడుముపై చెయ్యి వేసి రాజ్ కౌగిలించుకోవడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయింది.అయితే ఆ ఫోటోలను షేర్ చేస్తూ సమంత ఎమోషనల్ నోట్ రాసింది.
గత ఏడాదిన్నరలో నేను నా కెరీర్లో సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌లు తీసుకున్నాను, నా అంతర్దృష్టిని నమ్మడం నేర్చుకున్నాను. ఈ రోజు నా చిన్న విజయాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అత్యంత ప్రామాణికమైన వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నందుకు కృతజ్ఞురాలిని. ఇది కేవలం ప్రారంభం మాత్రమే…” అని సామ్ పేర్కొంది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, “సామ్ కొత్త లైఫ్ ప్రారంభించబోతుందా?”, “రాజ్‌తో రిలేషన్ కన్ఫర్మ్ అయ్యిందా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి సమంత, రాజ్ నిడిమోరు జంటపై నిలిచింది. ఇద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని నెట్టింట వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి.