Samantha | టాలీవుడ్ ప్రముఖ నటి సమంత ఇటీవల దర్శక–నిర్మాత రాజ్ నిడిమోరును కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలు వినిపించినప్పటికీ, అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాలేదు. అయితే ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన పెళ్లి ఆ రూమర్స్న్నింటినీ నిజం చేస్తూ సమంత–రాజ్ కొత్త జీవితం ప్రారంభమయ్యేలా చేసింది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా, రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఒక ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని రాజ్ నిడిమోరు సోదరి శీతల్ నిడిమోరు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ ఫోటోలో సమంత, రాజ్, ఆయన తల్లిదండ్రులు, రాజ్ సోదరి శీతల్, ఆమె ముగ్గురు కుమారులు కనిపిస్తున్నారు. అయితే శీతల్ భర్త ఆ ఫోటోలో లేకపోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోను షేర్ చేసిన ఫ్యాన్స్ “ఇదే సమంత కొత్త ఫ్యామిలీ” అంటూ పలు కామెంట్లు చేస్తున్నారు. అయితే తొలుత ఫోటోను పోస్ట్ చేసిన శీతల్, “ఇషాలో శివుడి ఆధ్వర్యంలో ఈ పెళ్లి జరగడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ పెళ్లి జరిగిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా ప్రస్తావించారు. దీనికి సమంత “లవ్ యూ” అంటూ స్పందించడంతో ఈ ఫ్యామిలీ బాండ్‌పై నెటిజన్లు హృదయపూర్వకంగా స్పందిస్తున్నారు. సమంత- రాజ్ పెళ్లికి సంబంధించిన ఇతర ఫొటోలని కూడా షేర్ చేయండని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.
అయితే సమంత క్రిస్టియన్ అయిన సమంత హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ… అమ్మవారి గుడిలో ప్రత్యేకంగా పెళ్లి చేసు కోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. లింగ భైరవి దేవత పట్ల సమంతకు ఉన్న లోతైన ఆధ్యాత్మిక అనుబంధం వల్లే సమంత అక్కడ పెళ్లి చేసుకుందని అంటున్నారు. గతంలో సమంత తన వ్యక్తిగత కష్ట సమయాల్లో లింగ భైరవి ఆలయాన్ని సందర్శించడం, అలానే ధ్యానంలో కూర్చోవడం వల్ల దేవి శక్తి తనకు ధైర్యం ఇచ్చిందని నమ్మింది. ఈ క్రమంలో తమ పెళ్లి అక్కడే జరగాలని భావించిన సమంత తమ దాంపత్య జీవితాన్ని ఈ పవిత్ర స్థలంలోనే ప్రారంభించింది.