సమంత కొద్ది రోజులుగా తెగ వార్తలలో నిలుస్తుంది.విడాకుల తర్వాత తనకి సంబంధించి ఎన్ని పుకార్లు వచ్చినా కూడా ఈ అమ్మడు కూల్‌గా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది.ఇటీవల తీర్ధయాత్రలకు వెళ్లి వచ్చిన సమంత మరి కొద్ది రోజులలో తను కమిట్ అయిన సినిమాలు చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజగా తన ఇన్‌స్టాలో మరో ఆసక్తికర పోస్ట్ చేసింది.
మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారోనని కంగారు పడనవసరం లేకుండా ఆమెను సమర్థంగా తీర్చిదిద్దండి. ఆమె పెళ్లి రోజు కోసం డబ్బు ఆదా చేసే బదులు, ఆమె చదువుకి ఖర్చు పెట్టండి. మరీ ముఖ్యంగా ఆమెను పెళ్లికి సిద్ధం చేసే బదులు, ఆమె కోసం ఆమెను సిద్ధం చేయండి. ఇతరులకు అవసరం అయిన సమయంలో మార్గదర్శకంగా ఉండేలా సిద్ధం చేయండని సమంత పేర్కొంది.ఈ అమ్మడి పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.