సమస్యలన్నింటినీ ఎదిరించి, గెలిచి మళ్లీ నటిగా బిజీ అయ్యింది నటి సమంత. ఇటీవలే ఆమె నటించిన ‘సిటాడెల్’ సిరీస్ ఓటీటీలో విడుదలైంది. ఇందులో సమంత ఓ బిడ్డకు తల్లిగా నటించింది. ఆ అనుభవం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ ‘సిటాడెల్’ వ్యక్తిగతంగా నాకు ఎన్నో అనుభూతుల్ని పంచిన సిరీస్. ఇందులో భారీ యాక్షన్ సీన్స్‌లో నటించా. హీరోలకు ఏ మాత్రం తీసిపోని పాత్రలు చేయాలని నేనెప్పుడూ కోరుకుంటా. అలా ంటి పాత్రనే ‘సిటాడెల్’లో చేశా. ఆలాగే ఓ బిడ్డకు తల్లిగా నటించడం మరిచిపోలేని అనుభవం. నిజంగా కూడా నాకు అమ్మను కావాలని బలంగా ఉంది. వయసు గురించి నాకు ఆందోళన లేదు. అమ్మ అనిపించుకోవడానికి వయసుతో సంబంధం లేదు. స్త్రీకి అమ్మతనం పుట్టుకతోనే ఉంటుంది. మా తృత్వం అనేది స్త్రీకి దేవుడిచ్చిన వ రం. కచ్చితంగా నా కోరిక తీర్చుకుంటా.’ అని చెప్పుకొచ్చింది సమంత.