అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ఊ అంటావా ఊఊ అంటావా (Oo Antava Oo Oo Antava) అంటూ సాగే పాట ఏ రేంజ్లో బాక్సాపీస్ ను షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాటలో చెన్నై సుందరి సమంత (Samantha) హాట్ హాట్ గ్లామరస్ లుక్లో కనిపించి ప్రేక్షకుల మనసు దోచేసింది. ఈ పాట ఖాతాలో అరుదైన ఫీట్ చేరింది. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజిషన్లో వచ్చిన ఈ సాంగ్ ఆల్ట్రా మ్యూజిక్ ఫెస్టివల్ (Miami Ultra Music Festival )లో ప్రద్శించబడింది.
ప్రస్తుతం మియామిలీ ఫెస్టివల్ జరుగుతుండగా..సాంగ్ స్క్రీనింగ్ వీడియో ఇపుడునెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ నెటిజన్ ఈ వీడియోను రికార్డు చేసిన ట్విటర్ లో పోస్ట్ చేశాడు. దీనికి సమంత స్పందిస్తూ..ఇది ఆల్ట్రా మియామిలో పక్కానేనా..? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది. సమంత ప్రస్తుతం యశోద సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
మరోవైపు గుణశేఖర్ డైరెక్షన్లో చేసిన శాకుంతలం త్వరలోనే థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. దీంతోపాటు విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో కాతువాకుల రెండు కాదల్ చిత్రంలో నటిస్తోంది.