Samantha – Naga Chaitanya | నటి సమంత- దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి ఇటీవల కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో చాలా సింపుల్‌గా జరిగింది. సమంత స్వయంగా ఈ పెళ్లి ఫొటోలను పంచుకోవడంతో గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో నాగచైతన్య రెండో భార్య, నటి శోభితా దూళిపాళ్ల తాజా పోస్ట్ ప్రస్తుతం నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. సమంతతో విడాకుల అనంతరం, నాగచైతన్య–శోభిత ప్రేమ గురించి రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరూ గతేడాది డిసెంబర్ 4న వివాహం చేసుకొని అందరికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ జంట తమ వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు.
అయితే తమ మొదటి పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా శోభిత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. పెళ్లి వీడియోను షేర్ చేస్తూ, గాలి ఎప్పుడూ ఇంటికి వీస్తుంది… నేను ‘భర్త’ అని పిలిచే వ్యక్తితో గడిపిన ఏడాది ఒక కొత్త ప్రయాణంలా అనిపిస్తోంది. అగ్నిశుద్ధి చేసినట్టుగా కొత్తగా ఫీల్ అవుతున్నా అని ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. దీనికి స్పందించిన నాగ చైతన్య.. “నీ జర్నీలో నేను భాగం కావడం ఆనందంగా ఉంది నా లవ్” అని కామెంట్ చేశారు. ఈ ఇద్దరి ఆప్యాయత నెటిజన్లను ఆకట్టుకోగా, సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. సమంత–రాజ్ నిడిమోరు పెళ్లి వార్తల మధ్య, చైతూ–శోభిత ప్రేమపూర్వక సంభాషణ నెట్‌జన్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో చైత, సమంతలు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు.
సమంత నాగచైతన్య 2010లో వచ్చిన ఏ మాయ చేసావే చిత్రంలో కలిసి పనిచేసారు. ఆ పరిచయం స్నేహంగా మారింది. 2014 ఆటోనగర్ సూర్య సినిమా సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్నారు. కాని ఊహించని విధంగా చైతన్య – సమంత అక్టోబర్ 2021లో విడిపోయారు. అయితే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సీజన్ 2 2020లో రూపొందగా, ఆ సమయంలో రాజ్ – సమంతకు పరిచయం అయింది. అప్పటికి సమంత – నాగచైతన్య ఇంకా విడిపోలేదు. ఈ సిరీస్ సమయంలో రాజ్ – సమంత దగ్గరవ్వడం వల్లే నాగచైతన్య – సమంతకు విబేధాలు వచ్చాయని జోరుగా వార్తలు వచ్చాయి.