Samantha | నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సింగిల్‌గా ఉంటున్న సమంత ఈ మధ్య ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఎక్కువగా కనిపిస్తుంది. రెండు నెలల క్రితం ముంబైలో పికిల్ బాల్ టోర్నమెంట్ సందర్భంగా ఇద్దరు కలిసి జంటగా కనిపించడంతో రూమర్స్ బలపడ్డాయి. ఇక సమంత నిర్మాతగా మారి రూపొందించిన శుభం సినిమాకు రాజ్ నిడిమోరు కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రొడక్షన్ మొత్తాన్ని ఆయనే హ్యాండిల్ చేసినట్టు తెలిసింది. శుభం మంచి హిట్ అయిన సందర్భంగా సమంత తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
అందులో రాజ్‌పై తల వాల్చి కూర్చున్నట్టుగా కనిపించింది. దీంతో వారిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ ప్రచారం నడిచింది. మరోవైపు వారు కొత్త ఇంటిని చూస్తున్నారనే టాక్ కూడా వినిపించింది. ఇక రాజ్- సమంతల రిలేషన్‌పై జోరుగా ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో సమంత మేనేజర్ స్పందించారు. ‘‘సమంత, రాజ్‌ల గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే’’ అంటూ ఆయన స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య కేవలం వృత్తిపరమైన స్నేహం మాత్రమే అని చెప్పుకొచ్చారు. మరి దీంతో అయిన పుకార్లకి పులిస్టాప్ పడుతుందా అనేది చూడాలి.
ఇక తాను నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రం ‘శుభం’ సినిమా విజయం పట్ల సమంత ఆనందం వ్యక్తం చేశారు. ‘‘మా మొదటి అడుగును ప్రేమతో స్వాగతించినందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అంటూ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు సమంత. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ సాధించి మంచి జోష్ మీద కనిపిస్తున్నారు. కొన్నాళ్లుగా మయోసైటిస్‌తో ఇబ్బందులు పడ్డ సమంత ఇప్పుడు కోలుకుంది. కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టింది.