సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకులు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. గర్భవతిగా ఉన్న సమంతకు డాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం, అందుకు పూర్తి విరుద్ధమైన సంఘటనలు ఆమెకు ఎదురైనట్లు టీజర్లో చూపించడం ఉత్సుకతను రేకెత్తించింది. యశోదను వెంటాడేదెవరన్నది సస్పెన్స్‌ను పంచింది.
నిర్మాత మాట్లాడుతూ ‘జాతీయ స్థాయిలో అన్ని భాషల ప్రేక్షకుల నుంచి టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 1400థియేటర్లలో టీజర్‌ను విడుదల చేశాం. అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చెప్పారు.
వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీశర్మ, సంపత్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా॥ చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, దర్శకత్వం: హరి-హరీష్.