Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంతకి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది. నాగ చైతన్యతో విడాకులు, ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, తండ్రి మరణం ఇలా పలు సమస్యలు సమంతని బాగా కుంగదీసాయి. ఈ కారణంగా కొన్ని నెలల పాటు చిత్రసీమకు దూరంగా ఉంది. అయితే సమంత ఇటీవలి కాలంలో బాలీవుడ్, హాలీవుడ్ వైపే ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. దీంతో తెలుగు అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సమంత తెలుగులో ఓ ప్రాజెక్ట్ ప్రకటించిన ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.
అయితే సమంత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 15 సంవత్సరాలు అవ్వడంతో తనకుఇటీవల బిహైండ్ వుడ్స్ అవార్డ్ అందజేశారు. ఈ అవార్డ్స్ ఈవెంట్‌కు సమంత చీరలో అందంగా రెడీ అయివెళ్లింది. చక్కగా, నవ్వుతూ కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. సమంత నటించిన మొదటి సినిమా ఏమాయ చేసావె సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు పంచుకుంది. 15 సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ కాలం అయిన కూడా సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికీ నాకు గుర్తు ఉన్నాయి.
ఏమాయ చేసావె సినిమాలో కొన్ని పెద్దగా గుర్తులేవు కాని, కెరీర్ బిగినింగ్ లో నేను నటించిన కొన్ని సినిమాలని ఇప్పుడు చూస్తే ఇంత చెత్తగా నటించానా అని అనిపిస్తుంది. అయితే వాటి నుండే పాఠాలు నేర్చుకొని ఈ స్థాయికి వచ్చాను. నాకు ఇండస్ట్రీలో బంధువులు, స్నేహితులు ఎవరు లేరు. సరైన గైడెన్స్ కూడా లేదు. భాష రాదు. అయితే నేను తొలిసారి నా స్నేహితుడు రాహుల్ రవీంద్రన్తో కలిసి మాస్కో కావేరి చిత్రం చేశాను. ఆ సినిమా అంత గుర్తు లేదు. కాని ఏ మాయ చేశావే మాత్రం చాలా స్పెషల్. ప్రతి షాట్ గుర్తుంది. కార్తిక్ (నాగచైతన్య)ను గేటు దగ్గర కలిసే సీన్ నా ఫస్ట్ షాట్ కాగా, చిత్రంలోని ప్రతి సీన్ కూడా ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంది అని సమంత చెప్పుకొచ్చింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.