సోషల్‌మీడియాను సమంత వాడినట్టుగా ఏ హీరోయిన్లూ వాడరు. అందుకే సినిమాలకు బ్రేకిచ్చినా అభిమానుల్లో మాత్రం ఆ ఫీలింగ్ లేదు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త లుక్‌లో దర్శనమిస్తూ, ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ జనాలతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంది సమంత. రీసెంట్గా ‘ఇండియాటుడే కాన్క్లేవ్ 2024’ కార్యక్రమంలో సందడి చేసింది సమంత. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో మీడియాతో ఆసక్తికరంగా మాట్లాడింది సామ్. బాలీవుడ్, టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ ‘బాలీవుడ్ స్టార్స్‌లో షారుక్ అంటే నాకు గౌరవం. అలాగే టాలీవుడ్ స్టార్స్‌లో ప్రభాస్ అంటేకూడా గౌరవమే. కానీ అల్లు అర్జున్‌పై మాత్రం క్రష్ ఉంది.’ అనేసి అందంగా నవ్వేసింది సమంత. తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ‘ కెరీర్ పీక్స్‌లో ఉన్నరోజుల్లో రోజుకు అయిదు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని. మనసుతోపాటు శరీరానికీ కూడా విశ్రాంతి ఇవ్వలేదు. ఫలితం.. అనారోగ్య కారణం వల్ల అగ్రస్థానంలో ఉండి కూడా ఆ ఆనందాన్ని అనుభవించలేకపోయాను. నా 14ఏళ్ల కెరీర్ నిండా ఒడిదుడుకులే’ అంటూ నిట్టూర్చించి సమంత.