సమంత భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పట్టుకున్నారు. రీసెంట్గా ఆమె అమెరికాలో జరుగుతున్న తానా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానాన్ని గుర్తు చేసుకొని సమంత ఎమోషనల్ అయ్యారు. ‘నా తొలి సినిమా ‘ఏమాయ చేసావె’ నుంచి నన్ను మీ మనిషిలా భావించారు. నాపై అలవిమాలిన ప్రేమను కురిపించారు. మీ ప్రేమకు ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం నాకు ఇన్నాళ్లకు దొరికింది.’ అంటూ శిరస్సు వంచి నమస్కరించారు సమంత.
ఇంకా మాట్లాడుతూ ‘ప్రస్తుతం కెరీర్ పరంగా చాలా ముఖ్యమైన దశలో ఉన్నా. రీసెంట్గా నిర్మాతను కూడా అయ్యాను. తొలి ప్రయత్నంగా ‘శుభం’ తీశా. తెలుగువారంతా ఆ సినిమాను చక్కగా ఆదరించారు. మంచి ఫలితాన్నిచ్చారు. మీరు ఎల్లప్పుడూ నా వెంటే ఉంటారనే ధైర్యంతోనే నేను ముందడుగు వేస్తుంటా. మీరు నాకొక ఐడెంటిటీ ఇచ్చారు. మీరే నా కుటుంబం. ప్రాంతాలను బట్టి మనం దూరంగా ఉండొచ్చు. మానసికంగా ఎప్పుడూ మనం కలిసే ఉంటాం.’ అంటూ కంటతడి పెట్టుకున్నారు సమంత.