Samantha | సమంత రూత్ ప్రభు… కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు, దేశవ్యాప్తంగా తన టాలెంట్, గ్లామర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. కెరీర్ ప్రారంభం నుంచే ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించిన సమంత, మధ్యలో కొంతకాలం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డా, ఇప్పుడు తిరిగి ఎప్పటిలాగే ఆరోగ్యంగా, మరింత ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఫిట్నెస్ విషయంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకోవడంలో ముందుండే సమంత, తన ఆరోగ్యం, ఫిట్నెస్ పట్ల కూడా అదే స్థాయిలో శ్రద్ధ చూపుతున్నారు.
సోషల్ మీడియాలో తరచూ తన వర్కౌట్ వీడియోలు, హెల్త్ టిప్స్, డైట్ రొటీన్స్ పంచుకుంటూ ఫాలోవర్స్‌కి ప్రేరణనిస్తున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ జిమ్ ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సమంత ఇద్దరు ట్రైనర్లతో కలిసి హ్యాంగింగ్ బార్‌పై ఒక డిఫికల్ట్ మూవ్ ట్రై చేశారు. చేతులలోఉన్న బలంతో శరీరాన్ని పైకి లేపే ఈ వర్కౌట్ తక్కువ మంది మాత్రమే చేయగలిగిన కష్టమైన వర్కవుట్. ఇది సమంత సాధారణంగా చేసే రొటీన్ వర్కవుట్ కాదు. స్పెషల్ ఛాలెంజ్ మోడ్‌లో ఆమె చేసిన ఈ ఎక్సర్సైజ్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
వీడియోలో సమంత చూపించిన ఫోకస్, పట్టుదల ప్రత్యేక హైలైట్‌గా నిలుస్తోంది. ట్రైనర్లు కూడా ఆమెతో పోటీపడుతూ వర్కౌట్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ఫిట్నెస్ పట్ల సమంత చూపిస్తున్న డెడికేషన్ అందరిని ఆకట్టుకుంటుంది. మరోవైపు ఆమె తన ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, ఫెయిల్యూర్స్, విజయాలను నిస్సహాయంగా షేర్ చేయడం నిజాయితీకి నిదర్శనం అంటున్నారు. ఇప్పటికే మయోసైటిస్ అనే వ్యాధిని జయించిన సమంత, మళ్లీ ఫుల్ ఎనర్జీతో కెరీర్లోకి దూసుకుపోతుంది. తాజాగా ‘శుభం’ అనే చిత్రానికి నిర్మాతగా మారి చిన్న క్యామియో చేశారు. ఇప్పుడు తన ప్రొడక్షన్ లో “మా ఇంటి బంగారం” సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిట్నెస్, సినిమాలు, ప్రొడక్షన్..ఇలా ప్రతి రంగంలోనూ సమంత తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది.