Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత,అక్కినేని హీరో నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఊహించని విధంగా విడాకుల బంధంతో వారి రిలేషన్ షిప్ బ్రేకప్ చేసుకున్నారు. ఇప్పటికీ వారిద్దరి విడాకుల గల కారణం తెలియరావడం లేదు. చైతూ-సమంత విడాకుల తర్వాత కనీసం ఫ్రెండ్స్ మాదిరిగా కూడా ఉండడం లేదని తెలుస్తుంది. అయితే సమంత నుండి విడిపోయిన చైతూ-శోభితని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక సామ్ ప్రస్తుతం రాజ్ అనే దర్శకుడితో సన్నిహితంగా ఉంటుంది. త్వరలో అతడిని పెళ్లాడే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.
అయితే చైతూ నుండి విడిపోయాక సమంత చిన్న చిన్నగా ఒక్కోజ్ఞాపకాన్ని చెరిపేస్తుంది.ఆ మధ్య తన పెళ్లి దుస్తులని రీమోడల్ చేయించింది. ఇక ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్‌ను లాకెట్టుగా మార్చుకుందని తెలుస్తోంది. ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు చేతిపై సేమ్ టాటూను వేయించుకున్నారు. ఇప్పుడు ఆ టాటూని సమంత తొలగించడం గమనార్హం. తాజాగా సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన పోస్ట్ మనం గమనిస్తే సమంత చేతిపై ఉన్న టాటూ అంత క్లియర్‌గా కనిపించడం లేదు. మసగ్గా ఉంది. మెల్లగా ఆ జ్ఞాపకాన్ని కూడా మాయ చేసే పనిలో సమంత ఉందని అంటున్నారు.
నాగ చైతన్య, సమంత ముందుగా ‘ఏ మాయ చేసావే చిత్ర షూటింగ్లో కలుసుకున్నారు. కొద్ది రోజులకి ప్రేమలో పడ్డారు. అనంతరం పెద్దల ఆశీర్వాదంతో 2017లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత ఈ జంట విడిపోయారు. విడాకులు తీసుకున్న తర్వాత సమంత మయోసైటిస్ బారిన పడి, సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత కొత్త పరయత్నాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత తన జర్నీకి సంబంధించి కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇందులో సమంత చేతిపై ఉన్న టాటూ చాలా డల్‌గా కనిపిస్తుంది. దీంతో అందరు కూడా సమంత పాత జ్ఞాపకాలని మెల్లగా చెరిపేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.